AP PRC 2022 HRA, Gratuity, Pending DA Clarity

AP PRC 2022 HRA, Gratuity, Pending DA Clarity

AP PRC 2022 HRA, Gratuity, Pending DA Clarity. Pending topics about House Rent Allowance, DA’s 2019, 2021 and 2022.

ఇలా అయితే నష్టమే…ఫిట్మెంట్ రూపంలో ఇప్పటికే నాలుగు శాతం నష్టం. DA లు కలపకుండా లెక్కిస్తే ఇప్పటికీ జీతం రాదు.

కరువు భత్యం లో PRC మేకప్ అంటున్న విశ్లేషకులు. ఇంటి అద్దె భత్యం తో పాటు ఇతరత్రా అనేక అంశాలపై అస్పష్టత

కొత్త జీతం అవే కీలకం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11 వి వేతన సవరణలో భాగంగా 23% ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతి చెల్లిస్తుంది. అయితే తాజాగా ఫిట్మెంట్ 23% శాతమే అని ప్రకటించడంతో అక్కడ నాలుగు శాతం మేర కోల్పోతున్నామని-అదే సమయంలో ఇంటి అద్దె భత్యం, సీసీఎ (సిటీ కాంపన్సేటరీ అలవెన్స్) రూపంలో లో మరింత నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేతన సవరణ ప్రకటన సమయంలో మధ్యంతర భృతి కన్నా ఫిట్మెంట్ తక్కువ ప్రకటించడం ఇదే తొలిసారి అని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు చెబుతున్నారు. పిఆర్సిసీ తో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని కరువు భత్యాలు DA లు 2022 జనవరి జీతంతో కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కరువు భత్యం వేరు, పిఆర్సిసీ వేరు అని పెండింగ్ డీఎలు PRC కి కలిపి జీతం లో పెరుగుదల ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక శాఖ విశ్రాంత ఉద్యోగులు కొందరు విశ్లేషిస్తున్నారు. పెండింగ్లో ఉన్న డీఎ లు ను పరిగణలోకి తీసుకోకుండా కేవలం PRC వరకే లెగిస్తే కొత్త వేతన సవరణ వల్ల ఇప్పుడు అందుకుంటారు జీతాలు కూడా రావని విశ్లేషిస్తున్నారు. ఇంటి అద్దె భత్యం లో CS కమిటీ ప్రతిపాదించిన తగ్గింపును పరిగణలోకి తీసుకొని లెక్కిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది.

ఇంటి అద్దె భత్యం పై రాని స్పష్టత

ఇంటి అద్దె భత్యం పై అశుతోష్ కమిటీ చేసిన సిఫారసులకు-CS ఆధ్వర్యంలో కమిటీ చేసిన సిఫారసులకు మధ్య బాగా వ్యత్యాసం ఉంది. CS కమిటీ ఇంటి అద్దె భత్యం నీ బాగా తగ్గించి చూపించింది. ఈ విషయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ప్రకటనలో నూ ఎలాంటి స్పష్టత లేదు. ఇంటి అద్దె భత్యం నీ ఏ ప్రకారం అమలు చేస్తారో తేల్చాల్సి ఉంది. దీనిపై ముఖ్యమంత్రి తో ప్రస్తావించానని, అది చిన్న విషయమే కదా…. అధికారులతో (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో) మాట్లాడు తేల్చుకోవాలని సీఎం వ్యాఖ్యానించినట్లు ఉద్యోగ సంఘ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇంటి అద్దె భత్యం, అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులకు భిన్నంగా…. ఆ రెండిటి కన్నా ఇంటి అద్దె భత్యం తగ్గేలా సి ఎస్ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. కొత్త PRC వల్ల మొత్తం ప్రయోజనం లెక్క తేలాలి అంటే ఇంటి అద్దె భత్యం కీలకమని ఉద్యోగ పేరు ఉంటుంది. HRA Clarity will come 08-01-2022.

ఆర్థికశాఖలో కొందరు నిపుణులు లెక్కకట్టి చెప్పిన వివరాలు

  1. ఒక డిప్యూటీ తహసిల్దార్ కు (గజిటెడ్ హోదా) మరికొందరు నాన్గెజిటెడ్ ఉద్యోగులకు 2013 PRC ప్రకారం కనీసం మూల వేతనం రూ.28,940 ఉంది. వీరు 27 శాతం ఐఆర్, ఇతర అన్ని అంశాలతో కలిపి ప్రస్తుతం రూ.49,932 జీతం పొందుతున్నారు.
  2. అది ఉద్యోగి తాజాగా PRC ప్రకారం 23 శాతం ఫిట్మెంట్, CS కమిటీ ప్రకటించిన ఇంటి అద్దె భత్యం పరిగణలోకి తీసుకొని అన్నీ కలిపి లెక్కిస్తే జీతం రూ.46,707 అవుతుంది. ప్రస్తుతం DA లు లతో కలిపి జీతం రూ.52,501 అవుతుంది. PRC వల్ల జీతం తగ్గుతుందని, ఎప్పుడో ఇవ్వాల్సిన కరువు భత్యం ఇప్పుడు ఇవ్వడం వల్ల మాత్రమే జీతం పెరుగుతున్నట్లుగా చూపుతున్నారని విశ్లేషిస్తున్నారు.
  3. గ్రామీణ ప్రాంతంలో ఒక డ్రైవర్
    గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఒక ప్రభుత్వ డ్రైవర్ కనీసం మూడు వేతనానికి ప్రస్తుతం 27 శాతం ఐఆర్ కలిపి రూ.26,674 జీతం పొందుతున్నారు. కొత్త PRC వల్ల ఆయనకు వచ్చే జీతం రూ.25,682 అవుతుంది. అంటే తగ్గిపోతుంది. కానీ ప్రభుత్వం పెండింగ్ DA లు కూడా ఇస్తామని చెప్పడంతో ఆయన జీవితం రూ.30,442 అవుతుంది.
  4. గ్రామీణ ప్రాంతంలో ఒక అటెండర్
    గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఒక అటెండర్ జీతం….2013 PRC కనీసం మూల వేతనం రూ.13,000, 27 శాతం ఐఆర్ తదితరాలతో ప్రస్తుతం రూ.22,430 గా ఉంది. అదే కొత్త PRC 27 శాతం ఫిట్మెంట్ తదితరాలతో లెక్కిస్తే రూ.21,600 అవుతుంది. వాటికి కొత్త DA లు కూడా జోడిస్తే జీతం రూ.25, 604కు పెరుగుతుంది. PRC కరువు భత్యం కూడా కలిపి ఇవ్వడం వల్లనే జీతాలు పెరుగుతున్నాయే తప్ప కొత్త PRC తో జీతాలు పెరగడం లేదని వీటిని చూస్తే నష్టపోతున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఆర్ఏ, సీసీఏ వంటివి కీలకం కాబోతున్నాయి. వాటి పై స్పష్టత రావాల్సి ఉంది.

వీటిపై స్పష్టత ఏదీ?

ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ మొత్తం పై ప్రకటన లేదు.

పెన్షనర్లకు అదనపు మొత్తం ఏ వయసు నుంచి ఇస్తారు సీఎం ప్రకటనలో పేర్కొన్న లేదు.

ఆటోమేటిక్ అడ్వాన్స్ scheme (AAS) పై స్పష్టత ఇవ్వలేదు.

ఉద్యోగం ఇచ్చే ప్రయాణ భత్యాలు తదితరాలు పైన తేల్చే లేదు.

Read: AP PRC 2022 Report: Fitment 23.29% Retirement Age 62, effect from January 2022

Scroll to Top