AP PRC 2022 Report: Fitment 23.29% Retirement Age 62, effect from January 2022

AP PRC 2022 Fitment 23.29% Retirement Age 62, effect from January 2022. Download Fitment Table Salary Wise. AP PRC 2022 Report: Fitment 23.29% Retirement Age 62, effect from January 2022

ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లు పెంచిన సీఎం

పిఆర్సి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన…

23.29 శాతం ఫిట్మెంట్ ప్రకటన

ఉద్యోగ సంఘాలతో పూర్తయిన చర్చలు ఇలా..

-నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులకు మీరు చెప్పిన అన్ని అంశాల పైన నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను.

-ఈ ఉదయం కూడా మరో విడత అధికారులతో మాట్లాడాను

-నిన్న నేను 2-3 ఈ రోజుల్లో ప్రకటిస్తాం అని చెప్పాను.

-కానీ నిర్ణయం ఎంత వీలైతే అంత త్వరగా చెబితే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను.

-రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, ఒమిక్రాన్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందని పరిస్థితుల మధ్య మనం ఉన్నామని, నిన్ననే చెప్పడం జరిగింది.

  • పల దపాలుగా చర్చలు జరిపాను.

Fitment 23.39% Table

New Salary:

-నిన్న ఆర్థిక శాఖ అధికారులకు చెప్పారు. చీఫ్ సెక్రెటరీ గారి కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రకారం అంటే 14.29 కంటే ఎంతమాత్రం కూడా ఇచ్చే పరిస్థితి లేదని విషయాన్ని పదేపదే ఆర్థిక శాఖ అధికారులు పలు దఫాలుగా చెప్పారు. మన ఆకాంక్షలు కూడా కాస్త తగ్గాలని కోరాను. అదే సమయంలో ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని CS గారికి, ఆర్థిక శాఖ కార్యదర్శికి చాలా సుదీర్ఘంగా చెప్పాను.

-నేను వారికి ఒకటే చెప్పాను. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం, సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే… ఉద్యోగుల సహాయ సహకారాలు సాధ్యం. అది లేకపోతే సాధ్యం కాదు. మా కుటుంబ సభ్యులు గాని మిమ్మల్ని అందరిని భావిస్తున్నాను.

-ఇది మీ ప్రభుత్వం. ఈ భరోసా కి ఎప్పటికీ ఉండాలన్నదే నా భావన కూడా.

-నిన్న పిఆర్సి తో కూడా కొన్ని కొన్ని అంశాలు మీరే లేవనెత్తారు. వాటిని కూడా పరిష్కరించే దిశగా చీఫ్ సెక్రటరీ గారితో, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడాను.

-స్పష్టమైన టైం లైను పైన కూడా మాట్లాడాను.

-23.29 శాతం ఫిట్మెంట్ ప్రకటన

  1. Covid కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలలో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జూన్ 30 లోగా ఈ ఈ నియామకాల అన్ని పూర్తి చేయాలని అధికారులకు తక్షణమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరి సమక్షంలో CS గారికి మళ్లీ చెప్తాను.

2.EHS-Emoplyess Health Scheme సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. రెండు వారాలు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చాను. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులు తో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వస్తుంది.

  1. సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు-రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో -ఎంఐజి లే హౌస్ లోని ఫ్లాట్లలో 10% ఫ్లాట్లను-రిజర్వ్ చేయడమే కాకుండా 20 శాతం రిబేటు ఇవ్వాలని నిర్ణయించాం. నియోజకవర్గానికి ఒక యూనిట్ తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరికీ కూడా ఇంటి స్థలం లేదు అనే మాట లేకుండా చేస్తాం. ఆ రిబేట్ కూడా ప్రభుత్వం భరిస్తుంది.
  2. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ 30లోగా ప్రొబెషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించి విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పే స్కేల్ లు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను.
  3. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు, పిఎఫ్, జిఎల్ఐ, లీవ్ ఎన్క్యాష్ మెంట్, తదితరాలన్నీ కూడా ఏప్రిల్ నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించాను.
  4. నిన్న మీతో చెప్పిన విధంగా, పీఆర్సీ అమలు చేసే నాటికి పెండింగ్ ఉండకూడదని స్పష్టంగా చెప్పిన మీదట పెండింగ్లో ఉన్న అన్ని DA లను ఒకేసారి జనవరి జీతం తో కలిపి ఇవ్వాలని ఆదేశించారు.
  5. సిఎస్ తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పిఆర్సి ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ-ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పది నెలల ముందే, అంటే జనవరి 1, 2022 నుంచే అంటే ఈ నెల నుంచే పీఆర్సీ అమలు చేసి, దాని ప్రకారం జీతాలు ఈ నెల నుంచి ఇవ్వాలని ఆదేశించాను.
  6. కొత్త స్కేల్ ను, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి 1 నుంచి, జనవరి జీతాలతో అమలు చేయాలని నిర్ణయించాం.
  7. సిఎస్ తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పిఆర్సి ప్రకారం మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పినప్పటికీ, మీ అందరి ప్రభుత్వంగా, 2020-ఏప్రిల్ నుంచి, అంటే 21 నెలలు ముందు నుంచి బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించాం.
  8. కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికన తీసుకొని, డైవర్స్ క్రెటిరియా తీసుకొని సైంటిఫిక్ పద్ధతిలో, ఒక వ్యక్తికి కాకుండా, ఏకంగా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సెంట్రల్ పే రివిజన్ కమిషన్ ప్రతిపాదనల్ని యధాతధంగా తీసుకొని ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. ఇక నుంచి ఈ పద్ధతి లోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
  9. ఇక ఫిట్మెంట్ విషయానికి వస్తే….. సిఎస్ తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం నుంచి ఫిట్మెంట్ ఇవ్వలేమని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్ ను వారు చెప్పినప్పటికీ…..

అటు ఉద్యోగాలు ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని, ఉద్యోగులకు వీలయినంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్మెంట్ ను 23 శాతం నిర్ణయించాం. అధికారుల కమిటీ చెప్పిన 14.29 శాతం కన్నా దాదాపు 9 శాతం పెంచి ఫిట్మెంట్ ఇస్తున్నామని ఉద్యోగ సోదరులకు సవినయంగా అర్థం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను.

-ఈ పీఆర్సీ అమలు 01-07-2018 నుంచి,

-మానిటరీ బెనిఫిట్ అమలు 01-04-2020 నుంచి

-కొత్త జీతాలు 01-01-2022 నుంచి అమల్లోకి వస్తాయి.

-ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ.10,247 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను.

  1. చివరగా మరొక ముఖ్యమైన కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు లు అనే కన్నా మంచి చేయడానికి ఎల్లవేళలా ఉద్యోగులకు తోడుగా ఉంటూ, మీ అందరికీ భరోసా ఇస్తూ…

మీరంతా సుదీర్ఘకాలం ప్రజాసేవలో జీవితం గడిపే వ్యక్తులు. మీరు ఇంకా మంచి చేయడానికి, మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి, అన్ని రకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మీ సేవలు అన్నీ మనం మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలి అన్న నిర్ణయంతో…. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నామని.. 01.01.2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలియజేస్తున్నాను.

-సిపిఎస్ కూడా సంబంధించి టైం లైన్ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేశాం. జూన్ 30 లోగా ఒక నిర్ణయం తీసుకుంటాం.

ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించే ఈ నిర్ణయాలను ప్రకటిస్తున్నాను. దేవుడు ఆశీస్సులు, ప్రజల అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగుల సహాయ సహకారాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Scroll to Top