పాఠశాలలలో విద్యార్థులకు ఇచ్చే మధ్యాహ్న భోజన పథకంలో Cooking Cost పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కొత్త రేట్లు ప్రకటించింది. ప్రైమరీ, అప్‌పర్ ప్రైమరీతో పాటు 9, 10 తరగతులకూ పెంపు వర్తింపచేశారు. 2024 జనవరి 1 నుండి ఈ రేట్లు అమల్లోకి వస్తాయి.
ఆహార పదార్థాల ధరలు, మార్కెట్ రేట్లు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో cooking cost లో 10% నుండి 13% మధ్య పెరుగుదల నమోదైంది.
Telangana MDM New Cooking Cost Rates TG మధ్యాహ్న భోజన మెనూ ఛార్జీలు పెంపు 2025
కొత్త రేట్లు ఇలా ఉన్నాయి:
| తరగతి | పాత Cooking Cost (రూ.) | కొత్త Cooking Cost (రూ.) | పెరుగుదల శాతం |
|---|---|---|---|
| 1-5 | రూ.5.45 | రూ.6.19 | 13.5% |
| 6-8 | రూ.8.17 | రూ.9.29 | 13.7% |
| 9-10 (గుడ్డు సహా) | రూ.10.67 | రూ.11.79 | 10.5% |
గ్యాస్ మీద Cooking తప్పనిసరి – DEO ఆదేశాలు
Rc.No: 1228/B4/MDM/2025, Date: 23.07.2025
కామారెడ్డి DEO ఆదేశాల ప్రకారం:
- ఇకపై MDM ని fire wood మీద వండకూడదు
- LPG Gas మీద మాత్రమే Cooking చేయాలి
- గ్యాస్ లేని పాఠశాలలు వెంటనే LPG connection తీసుకోవాలి
- Rainy season లో fire wood వల్ల food quality పడిపోతుంది, cook helpers కి smoke వల్ల health issues వస్తాయి - అందుకే ఈ నిర్ణయం
Egg cost I to VIII: Rs.6/- per egg